fbpx
Sunday, April 6, 2025
HomeMovie Newsఅల్లుడు అదుర్స్ ట్రైలర్: కామెడీ యాక్షన్ మాస్ మసాలా

అల్లుడు అదుర్స్ ట్రైలర్: కామెడీ యాక్షన్ మాస్ మసాలా

BellamKondaSaiSrinivas AlluduAdurs TrailerReleased

టాలీవుడ్: బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం నటించిన సినిమా ‘అల్లుడు అదుర్స్’. సంక్రాంతి సందర్భంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజే విడుదలైంది. ట్రైలర్ చూసిన తర్వాత ఇదొక కామెడీ, యాక్షన్, మాస్ మసాలా సినిమా అని స్పష్టంగా తెలుస్తుంది. కందిరీగ, రభస లాంటి సినిమాలని రూపొందించిన సంతోష్ శ్రీనివాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. తన పద్ధతి ఏ మాత్రం మార్చుకోకుండా మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి ఫార్ములా పట్టుకొని తీసినట్టు తెలుస్తుంది. శ్రీను వైట్ల టెంప్లేట్ లో విలన్ దగ్గరికి వెళ్లి విలన్ నే వెర్రి వెంగళప్ప చేసి కామెడీ చేసి చివరకి ఒక యాక్షన్ సీక్వెన్స్ పెట్టి సినిమా ముగించడం. ఈ సినిమా కూడా పెద్ద తేడా ఏమీ లేదని స్పష్టంగా తెలుస్తుంది. కాకపోతే ఇందులో కొంచం దయ్యం కామెడీ పెట్టారు అని అర్ధం అవుతుంది.. అది కూడా లారెన్స్ కాంచన సినిమా స్పూఫ్ లాగా కనిపిస్తుంది.

ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ కి జోడీగా నభ నటేష్ మరియు అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. ట్రైలర్ లో నభ తన పాత్ర వరకు ఆకట్టుకుంది. ట్రైలర్ ప్రకారం అను ది చిన్న పాత్ర అని అర్ధం అవుతుంది. ట్రైలర్ లో కొన్ని సీన్స్ లోనే కనిపించిన వెన్నెల కిశోర్ ఎప్పటిలానే ఆకట్టుకున్నాడు. గంజి రమేష్ కుమార్ సమర్పణలో సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై గొర్రెల సుబ్రహ్మణ్యం ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాలనే పరవాలేదనిపించింది. ‘రాక్షసుడు’ సక్సెస్ మీట్ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పటినుండి రొటీన్ సినిమాలు చేయనని మంచి సినిమాలు చేస్తానని చెప్పారు.. కానీ మళ్ళీ తన పాత రూట్ లోకే వెళ్లినట్టు అనిపిస్తుంది.

#AlluduAdhurs Trailer | Alludu Adhurs Movie | Bellamkonda Sreenivas | Nabha Natesh | DSP

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular