టాలీవుడ్: టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా వీ వీ వినాయక్ దర్శకత్వంలో ‘అల్లుడు శ్రీను’ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి పరిచయం అయిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిట్ ప్లాప్ సంబంధం లేకుండా వరుస పెట్టి హై బడ్జెట్ మాస్ సినిమాలు చేస్తూ తన ప్రతి సినిమా పెద్ద డైరెక్టర్, టాప్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూ ఇప్పటి వరకు నెగ్గుకొచ్చాడు. ఇపుడు బాలీవుడ్ వైపు అడుగులు వేస్తున్నాడు ఈ యువ హీరో. తన సినిమాలన్నీ యు ట్యూబ్ లో డబ్ అయ్యి ఎక్కువ వ్యూస్ రావడం తో హిందీ లో కూడా సినిమాలు చేయాలనీ నిర్ణయం తీసుకున్నాడు. తన మొదటి సినిమాగా ప్రభాస్ , రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఛత్రపతి’ ని ఎంచుకున్నాడు.
ఈ సినిమా గురించి గత కొన్ని రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ ఇవాల అధికారికంగా ప్రకటించారు. పెన్ స్టూడియోస్ బ్యానర్ పై డా.జయంతిలాల్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. తనతో మొదటి సినిమా తీసిన ‘అల్లుడు శ్రీను’ డైరెక్టర్ వీ వీ వినాయక్ దర్శకత్వంలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నాడు. వీ వీ వినాయక్ కూడా ఇప్పటి వరకి ఠాగూర్, ఖైదీ నం 150 లాంటి రీ-మేక్ లు చేసి హిట్ లు కొట్టాడు. ఇపుడు బాలీవుడ్ లో ఈ రీ-మేక్ తో ఎలాంటి హిట్ కొడతాడా చూడాలి.