తెలంగాణ: తెలంగాణలో బెనిఫిట్ షోలపై నిషేధం
సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం ప్రకటించింది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకారం, బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందించనున్నట్టు తెలిపారు.
బెనిఫిట్ షోలపై కఠిన నిర్ణయం
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి స్పష్టం చేస్తూ, రాష్ట్రంలో ఇకపై సినిమా విడుదలకు ముందు రోజు బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని పేర్కొన్నారు. ప్రీమియర్ షోల పేరుతో జరిగే అపశ్రుతులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
టికెట్ ధరల పెంపుపై ఆంక్షలు
మరియు టికెట్ల రేట్లను అనేకపాళ్లుగా పెంచే అంశంపై కూడా మంత్రి స్పందిస్తూ, టికెట్ ధరలపై నియంత్రణ విధించనున్నామని చెప్పారు. ప్రేక్షకుల భద్రతకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన వెల్లడించారు.
గాయపడిన బాలుడి వైద్యం ప్రభుత్వ భాద్యత
తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వైద్యం ఖర్చులను తెలంగాణ ప్రభుత్వం భరించనున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ విషయంలో హీరో అల్లు అర్జున్ ఇచ్చిన హామీ నెరవేరలేదని ఆయన విమర్శించారు.
ప్రభుత్వం చర్యలు పట్ల ప్రజల మద్దతు
ఈ నిర్ణయాల వల్ల సినిమా థియేటర్లలో రద్దీని నియంత్రించడం, ప్రజల భద్రతను మెరుగుపరచడం సాధ్యమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ చర్యలపై సినీ పరిశ్రమ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.