fbpx
Tuesday, January 7, 2025
HomeBig Storyభారత్ లో తొలి HMPV Virus కేసు!

భారత్ లో తొలి HMPV Virus కేసు!

BENGALURU-REPORT-FIRST-HMPV-VIRUS-CASE-IN-INDIA
BENGALURU-REPORT-FIRST-HMPV-VIRUS-CASE-IN-INDIA

బెంగళూరు: చైనాలో వెలుగుచూసిన HMPV Virus తొలి కేసు ఇవాళ భారత్‌లోని బెంగళూరులో కూడా నమోదైంది.

నగరానికి చెందిన ఎనిమిది నెలల చిన్నారికి ఈ వైరస్ (Human Metapneumovirus) సోకినట్లు నిర్ధారణైంది.

కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేసింది. కాగా, ఒక ప్రైవేట్ ల్యాబ్‌లో చేసిన పరీక్షల్లో ఈ వైరస్ ఉన్నట్లు తేలిందని అధికారులు తెలిపారు.

అయితే, చైనా మరియు జపాన్ వరకు పరిమితమైన ఈ వైరస్ ఇప్పుడు బెంగళూరులో కనిపించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇప్పటి వరకు, ఈ వైరస్ ఎలా సోకిందన్న వివరాలు తెలియరాలేదని, దీనికి సంబంధించి స్ట్రెయిన్‌పై నిపుణులు పరిశోధనలు కొనసాగిస్తున్నారని కర్ణాటక ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఈ వైరస్ సోకిన వారికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా పదకొండు ఏళ్ల లోపు పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని చైనా వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. వ్యాప్తి నియంత్రణకు అక్కడి ప్రభుత్వం పలు ఆంక్షలను అమలు చేస్తోంది.

ఇప్పుడు జపాన్‌లో కూడా ఈ వైరస్ ప్రభావం కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular