fbpx
Monday, December 23, 2024
HomeLife Styleఆన్ లైన్ యాప్ ల ద్వారా రూణాలు తీసుకోవద్దు: డిజీపీ

ఆన్ లైన్ యాప్ ల ద్వారా రూణాలు తీసుకోవద్దు: డిజీపీ

BEWARE-OF-ONLINE-LOAN-APPS

హైదరాబాద్‌: చట్టబద్దత లేని ఆన్ లైన్ యాప్‌ల ద్వారా రుణాలను స్వీకరించవద్దని తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి సూచించారు. వేధింపులకు పాల్పడే యాప్‌ల పై పొలీసులకు ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్, బ్యాంకు నుండి గాని రుణాలు అందించేవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు కచ్చితంగా వర్తిస్తాయని డీజీపీ తెలిపారు.

ఈ మధ్య కాలంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో యాప్‌ల ద్వారా అనేక మందికి నగదు రుణాలు అందించి వాటిని తిరిగి చెల్లించే క్రమంలో చేసిన వేధింపులను భరించలేక పలువురు ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలో డీజీపీ ఒక ప్రకటన విడదల చేశారు.

ఆర్‌బీఐ చట్టానికి లోబడి రిజిస్టర్ కాని ఏ నాన్ బ్యాకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు చట్టబద్దత లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న ఈ ఆన్‌లైన్‌ యాప్‌లలో అధికశాతం ఆర్‌బీఐలో నమోదు కాలేదని, అందువల్ల వారికి రుణాలు అందించే అధికారం లేదని పేర్కొన్నారు.

ఈ యాప్‌లలో అధికంగా చైనీస్‌వే ఉన్నాయని, వాటికి రిజిస్టర్ అయిన చిరునామా గాని, సరైన మొబైల్ నంబర్ గాని ఇతర వివరాలు ఉండవని పేర్కొన్నారు. ఫోన్ ద్వారానే సమాచారాన్ని (డేటా) ను యాప్ ల నిర్వాహకులు తెలుసుకుంటారని, ఈ యాప్‌ల యూజర్లు లిఖిత పూర్వకంగా లేని రూపంలో తమ కాంటాక్ట్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలు, సోషల్ మీడియా సమాచారం ఇతర వ్యక్తిగత సున్నిత అంశాలను తమకు తెలియకుండానే అందిస్తారు.

రుణాలను చెల్లించనట్లైతే మీ పై క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని రుణం అందించే యాప్‌లు బెదిరించే అవకాశం ఉందని, ఈ పరిస్థితులు ఎదురైతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ తెలిపారు. ఆర్‌బీఐలో రిజిస్టర్ కాని, అక్రమ యాప్‌ల ద్వారా ఏవిధమైన రుణాలు స్వీకరించవద్దని డీజీపీ కార్యాలయం ప్రజలకు సూచించింది. ఈ విషయంలో ఎవరైన వేధింపులకు గురయితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular