fbpx
Saturday, November 30, 2024
HomeMovie Newsశర్వా 'శ్రీకారం' నుండి 'భలేగుంది బాలా' పాట విడుదల

శర్వా ‘శ్రీకారం’ నుండి ‘భలేగుంది బాలా’ పాట విడుదల

BhaleBhagundi SongReleased FromSrikaramMovie

టాలీవుడ్: శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ ప్రస్తుతం జంటగా నటిస్తున్న సినిమా ‘శ్రీకారం’. షూటింగ్ దాదాపు పూర్తి చేసికొని మిగతా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకొని సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి శ్రీకారం చుట్టుకున్న టీం ప్రచారం లో భాగంగా మొదటి పాటని విడుదల చేసింది. నాని ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాలో ‘దారి చూడు దుమ్ము చూడు మామ’ పాట రచించి ఆలపించిన పెంచల్ దాస్ ఈ పాటని కూడా ఆలపించారు. ఈ పాట కూడా ఆ పాట లాగానే జానపదం టచ్ తో ఉంటుంది. లిరిక్స్ కూడా క్యాచీ గా ఉన్నాయ్. ఈ పాటని కూడా పెంచల్ దాస్ రచించడం విశేషం.

‘వచ్చానంటివో.. పోతానంటివో.. వగలు పలుకుతావే.. కట్టమీద పోయే అలకల సిలికా.. భలేగుంది బాలా..’ అంటూ సాగిన ఈ పాట సాహిత్యం రాయలసీమ భాషలో ఆకట్టుకుంది. సినిమా కూడా రాయలసీమ చిత్తూర్ , తిరుపతి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంది. వీడియోలో చూపించిన శర్వానంద్, ప్రియాంక లుక్స్ ఆకట్టుకున్నాయి. పల్లెటూర్లో ఉండే వేషధారణలు పోలి ఉన్నాయి. ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. కిషోర్ రెడ్డి అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించిన ఈ పాట ఇన్స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి ప్రముఖ రచయిత ‘సాయి మాధవ్ బుర్రా’ మాటలు అందించారు. ఈ సినిమాలో రావు రమేష్, మురళి శర్మ, నరేష్, ఆమని, సప్తగిరి.. తదితరులు నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular