హైదరాబాద్: ‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర నటిస్తున్న సినిమా పేరు ‘భానుమతి రామకృష్ణ’ , జులై 3 న ఓటీటీ లో విడుదల అవ్వుతుంది. ఈ సినిమాలో నవీన్ కి జంటగా సలోనీ లూథ్రా అనే కొత్త అమ్మాయి నటిస్తుంది. నార్త్ స్టార్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పైన శరత్ మరార్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. యశ్వంత్ ములుకుట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ నాగోగి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకి దర్శకత్వం వచించారు. ఈరోజే ఈసినిమాకి సంబంచిన టీజర్ విడుదల చేశారు.
ఈ టీజర్ లో హీరో హీరోయిన్ పాత్రల పరిచయాలు , వాళ్ళ స్వభావాలు ఒక నిమిషం నిడివి ఉన్న టీజర్ లో చెప్పారు. 33 ఏళ్ళకి పైగా ఉన్న ఒక పల్లెటూరు అబ్బాయి అలాగే 33 ఏళ్ళకి పైగా ఉన్న ఒక సిటీ అమ్మాయి మధ్యన జరిగే పరిచయం, ప్రేమ, ఇగో , పెళ్లి ని ముఖ్య అంశంగా తెరకెక్కినట్టు కనిపిస్తుంది. హర్ష చెముడు వాయిస్ ఓవర్ తో టీజర్ లో ఇచ్చిన పాత్రల పరిచయం ఆకట్టుకుంది. హ్యూమౌర్ ప్రధానాంశంగా తెరకెక్కిన ఈసినిమా, ఇప్పటివరకు విడుదల ఐన టీజర్ మరియు ట్రైలర్ సినిమా ప్రేక్షకులకి ఆసక్తికరంగానే అనిపించాయి.