టాలీవుడ్: తెలుగు జాతి, తెలుగు సినిమా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు. తెలుగు ని ప్రపంచ ఖ్యాతి ని చేరవేయడంలో ఎన్టీఆర్ పాత్ర చాలా ఉందని చెప్పవచ్చు. ఈ రోజు ఎన్టీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా అందరూ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తెలుగు జాతికి సినిమా పరంగా, రాజకీయ పరంగా ఎన్నో సేవలు అందించారు. ఆ సేవలను గుర్తించి ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలని ట్విట్టర్ వేదికగా కోరారు. ఇంతకముందు ప్రముఖ సింగర్ భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టే ఎన్టీఆర్ గారికి కూడా భారత రత్న ఇస్తే తెలుగు వారందరికీ కూడా గర్వకారణం అని తెలియచేసారు.
నిజంగా చెప్పాలంటే తెలుగు గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా, ఖండాంతరంగా వ్యాప్తి చేయడంలో ఎన్టీఆర్ గారు మరువలేని కృషి చేసారు. దాదాపు 300 లకు పైగా సినిమాల్లో హీరోగా, పదుల సంఖ్యలో సినిమాలకి నిర్మాతగా, డైరెక్టర్ గా, రాజకీయాల్లోకి వచ్చి ఒక రీజనల్ పార్టీ ని స్థాపించి స్థాపించిన మొదటి సంవత్సరంలోనే అధికారంలోకి వచ్చి, మూడు సార్లు రాష్ట్ర ముఖ్య మంత్రిగా వ్యవహరించి ఎన్నో సంస్కరణలకు శ్రీకారం చుట్టి తెలుగునాట కొన్ని తరాలు తలచుకుని , గుర్తుపెట్టుకుని పనులు చేసాడు ఎన్టీఆర్. ఇలాంటి ఒక వ్యక్తికి బారతరత్నం ఇవ్వడం దేశానికి మాత్రమే కాకుండా తెలుగు వారికి కూడా గౌరవం గానే ఉంటుంది. ఈ సందర్భంగా చిరంజీవి కోరికని కేంద్రం దృష్టిలో ఉంచుకుని ఈ అవార్డుకు ఎన్టీఆర్ గారి అర్హతని పరిశీలిస్తుందని ఆశిద్దాం.