fbpx
Thursday, September 19, 2024
HomeMovie Newsభారతీయుడు 2: దెబ్బ మీద దెబ్బ!

భారతీయుడు 2: దెబ్బ మీద దెబ్బ!

BHARATEEYUDU-2-DISAPPOINTMENTS-CONTINUE
BHARATEEYUDU-2-DISAPPOINTMENTS-CONTINUE

మూవీడెస్క్: కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై, థియేటర్లలో ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయింది.

1000 తెస్తుంది అనుకున్న ఈ సినిమా 150 కోట్లకు బాక్సాఫీస్ వద్ద ఆగిపోయింది. ఈ సినిమా తర్వాత వాస్తవంగా నిర్మాతలకు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.

థియేట్రికల్ రన్ విఫలమైన తర్వాత, ఇప్పుడు ఓటీటీలో విడుదల కుదరడంలో ఇబ్బందులు వస్తున్నాయి.

విడుదలకి ముందే భారతీయుడు 2 డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకుంది. అయితే సినిమా అనుకున్నంత విజయం సాధించకపోవడంతో నెట్‌ఫ్లిక్స్ ఈ ఒప్పందాన్ని పునరాలోచించనుంది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నెట్‌ఫ్లిక్స్ తమ చెల్లింపులను తగ్గించి, భారతీయుడు 3 ప్రాజెక్ట్‌తో కొత్త డీల్ చేసుకోవాలని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

అంటే మొదట అనుకున్న రేటు కంటే ఇప్పుడు చాలా తక్కువ ధరకు అడుగుతున్నరట. ఈ కారణంగా నిర్మాతలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.

ఇకపై, భారతీయుడు 2 ని ఓటీటీలో చూడగలమా లేదా అన్నది ప్రశ్నగా మారింది. అలాగే, ఇతర సినిమాలు కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి.

అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా ఇప్పటికి అదే సమస్యలలో ఉండది. ఈ పరిణామం ఒటీటీలో కంటెంట్ సెలక్షన్ విషయంలో మారుతున్న ధోరణిని సూచిస్తోంది.

‘భారతీయుడు 3’ పట్ల ఈ పరిస్థితి భవిష్యత్‌లో ఎలా ప్రభావం చూపుతుందో చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular