టాలీవుడ్: మళయాళం లో రూపొంది సూపర్ హిట్ అయిన అయ్యప్పణ్ణుమ్ కోశియుమ్ సినిమాని తెలుగు లో పవన్ కళ్యాణ్ – రానా కాంబినేషన్ లో సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాని భీమ్లా నాయక్ అనే టైటిల్ తో రూపొందిస్తున్నారు. దీంతో భీమ్లా నాయక్ పాత్రలో పోషిస్తున్న పవన్ కళ్యాణ్ కి సంబందించిన ఫస్ట్ గ్లింప్స్ వీడియో ఈ రోజు విడుదల చేసారు. రెబెల్ భావాలున్న నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కి ఒక రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి కి వచ్చిన ఈగో క్లాషెస్ ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ఈ రోజు విడుదల చేసిన వీడియో లో పవన్ కళ్యాణ్ మాస్సీ అప్పియరెన్స్ తో మెప్పించారు.
లుంగీ పైకి ఎత్తి కట్టి ‘రేయ్ డానీ.. బయటకి రా రా నా కొడకా’ అంటూ అడ్డం వచ్చిన వాళ్ళని తన్నుకుంటూ వెళ్లే అగ్రెస్సివ్ లుక్ లో పవన్ తన ఫాన్స్ కి విజిల్ మూమెంట్స్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ లో లా లా .. భీమ్లా.. అడవి పులి.. గొడవ పడి అంటూ వచ్చే పాట అగ్నికి వాయువు తోడైనట్టు పవన్ అగ్రేషన్ కి బాగ్ గ్రౌండ్ మ్యూజిక్ మంచి ఎలివేషన్ లా పని చేసింది. ఒరిజినల్ మలయాళం లో వినిపించే ట్యూన్ ని కొంచెం మార్చి థమన్ ఇక్కడ వాడాడు.
అప్పట్లో ఒకడుండేవాడు సినిమాని డైరెక్ట్ చేసిన సాగర్ కే చంద్ర ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ పాటని విడుదల చేయనున్నట్టు కూడా తెలియ చేసారు. సంక్రాంతి సందర్భంగా 12 జనవరి 2022 న ఈ సినిమా విడుదల చేయనున్నారు.