కుప్పం: ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తన 4 రోజుల పర్యటనలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు.
ఈ పర్యటనలో ఆమె మొత్తం 12 గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబుకు మెజారిటీ వచ్చిన మండలాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు.
భువనేశ్వరి పర్యటనలో మహిళల ఆర్థిక బలోపేతంపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలను ప్రారంభించి మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
వెంగాటుపల్లి, అడవి బూదుగూరు, గుండ్ల మడుగు, డీకే పల్లి వంటి గ్రామాల్లో మహిళలతో భేటీ అయ్యి వారి సమస్యలను స్వయంగా తెలుసుకోనున్నారు.
ఈ పర్యటనలో మహిళల జీవనోపాధి మెరుగుదలకే కాకుండా గ్రామీణ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని నిశ్చయించారు. భువనేశ్వరి పర్యటనతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంతో పని చేస్తున్నారు.