బ్రెసీలియా: బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్నారు, తాజాగా ఆయన మరోమారు తన వ్యంగ్య ధోరణిని చూపించారు. బ్రెజిల్ దేశంలో మొదలుపెట్టిన భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభ సమయంలో ,ఫైజర్ ఇచ్చిన కాంట్రాక్టులో స్పష్టంగా కంపెనీ ఏ సైడ్ ఎఫెక్ట్స్‌కు బాధ్యత వహించదని ఉందని, అందువల్ల టీకా తీసుకున్న తర్వాత ఎవరైనా మొసలిగా మారితే అది వారి సమస్యే అవుతుందని ఆయన హెచ్చరించారు.
ఫైజర్ కరోనా కట్టాడి వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు ఒక వేళ సూపర్ హ్యూమన్‌గా మారినా, మహిళలకు గడ్డాలు వచ్చినా, మొగవాళ్ల గొంతులు మారినా, ఫైజర్ కు సంబంధం ఉండదని గుర్తు చేశారు.
బ్రెజిల్ లో పరిస్థితి ఇలా ఉండగా అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జోబైడెన్ ఆయన భార్య జిల్ బైడెన్‌కు సోమవారం కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకోనున్నారని అధికారులు వెల్లడించారు. వ్యాక్సిన్ పట్ల అమెరికా ప్రజల్లో చైతన్యం నింపేందుకు మరియు నమ్మకం కలిగించేందుకు బైడెన్ తాను బహిరంగంగా వ్యాక్సిన్ తీసుకుంటానని ఇప్పటికే ప్రకటించారు.
శుక్రవారం ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ఆయన భార్య కరెన్‌కు, హౌస్ స్పీకర్ నాన్సీపెలోసికి కరోనా వైరుస్ అడ్డుకునే వ్యాక్సిన్ యొక్క తొలిడోసు ఇచ్చారు. ఈ వ్యాక్సిన్ షాట్ తీసుకున్న తనకు ఎలాంటి సైడ్ ఎఫెక్టులు కనిపించలేదని పెన్స్ చెప్పారు.