మూవీడెస్క్: ప్రశాంత్ వర్మ ఇటీవల పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించిన ‘హనుమాన్’తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు.
తన సినిమాటిక్ యూనివర్స్‌లో సూపర్ హీరో కథలతో ప్రేక్షకులను ఆకట్టుకోవాలన్న లక్ష్యంతో ఉన్న ఆయన, ఇప్పుడు ‘జై హనుమాన్’ను తెరకెక్కించబోతున్నాడు.
ఇందులో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. దీపావళి సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్‌కి మంచి స్పందన లభించింది.
‘జై హనుమాన్’ కథలో హనుమంతుడు శ్రీరాముడికి ఇచ్చిన మాటను ప్రతిబింబించేలా దర్శకుడు కథను అల్లుకున్నట్లు తెలుస్తోంది.
విజువల్స్ పరంగా గొప్పగా ప్రదర్శించాల్సిన ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ వర్మకు కత్తి మీద సాము లాంటిదని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రేక్షకుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని హనుమంతుడి పాత్రను సమర్థవంతంగా చూపించాలన్నది దర్శకుడిపై ఉన్న ప్రధాన బాధ్యత.
ఇక రిషబ్ శెట్టి పాత్రకు పూర్తి న్యాయం చేయడం, అలాగే క్లైమాక్స్‌లో శ్రీరాముడి పాత్రను ఎలివేట్ చేస్తారా అనే విషయాలు సినిమాపై ఉన్న క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి.
శ్రీరాముడి పాత్ర కోసం ఏ నటుడిని ఎంచుకుంటారో లేదా AI టెక్నాలజీ ద్వారా ప్రదర్శిస్తారా అనే చర్చలు నడుస్తున్నాయి.
‘జై హనుమాన్’ విజయం సాధిస్తే ప్రశాంత్ వర్మ రేంజ్ మరింత పెరుగుతుందని, స్టార్ హీరోలు కూడా అతని యూనివర్స్‌లో భాగం కావాలనే ఆసక్తిని ప్రదర్శించే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.