మూవీడెస్క్: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ టాలీవుడ్ పై దృష్టి పెట్టినట్లు ఫిల్మ్ నగర్ లో చర్చలు జరుగుతున్నాయి.
‘బ్రహ్మాస్త్ర’ ప్రమోషన్ సమయంలో తెలుగు ఆడియన్స్ తో ఏర్పరుచుకున్న బాండ్ ఇప్పుడు మరింత గట్టిపడనుంది.
‘యానిమల్’తో తెలుగు ప్రేక్షకులను శభాష్ అనిపించిన రణబీర్, తెలుగులో స్ట్రైట్ మూవీ చేయాలని ఉత్సాహం చూపిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం, రణబీర్ తన నెక్ట్స్ మూవీ కోసం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థతో చర్చలు జరుపుతున్నాడట.
ఈ సినిమాను ఒక టాప్ తెలుగు దర్శకుడు తెరకెక్కించనున్నట్లు టాక్.
అయితే ఆ దర్శకుడి పేరు ఇంకా బయటకు రాలేదు.
యానిమల్ మూవీ భారీ విజయంతో తెలుగు మార్కెట్ లో రణబీర్ క్రేజ్ పెరగడంతో, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక రణబీర్ ప్రస్తుతం ‘రామాయణ’ పార్ట్ 1 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
అలాగే ‘లవ్ అండ్ వార్’ ప్రాజెక్ట్ ను కూడా లైన్‌లో ఉంచాడు. ఈ రెండు సినిమాలు 2026లో రిలీజ్ కానున్నాయి.
వాటితో పాటు టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వాలని ప్లాన్ చేస్తుండటంతో రణబీర్ అభిమానుల్లో హైప్ పెరుగుతోంది.