తెలంగాణ: కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేతకు రంగం సిద్ధమైందా?
ఈ విషయంపై హైడ్రా అధికారులు సర్వే పూర్తి చేసి, చర్యలు చేపట్టడానికి సిద్ధమయ్యారు. జీవో నెంబర్ 111ను ఉల్లంఘిస్తూ ఈ ఫామ్‌హౌస్ నిర్మితమైందని అధికారులు తెలిపారు.
ఇటీవల హైదరాబాదులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కఠిన చర్యలు తీసుకుంటుండగా, ఈ ఫామ్‌హౌస్‌పై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
అక్రమ నిర్మాణాలను అరికట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా సంస్థకు మరిన్ని అధికారాలు ఇచ్చారు.
హైడ్రాకు పోలీస్ స్టేషన్ స్టేటస్ ఇస్తూ, నేరుగా FIR నమోదు చేసే వెసులు బాట కల్పించారు. ఈ నిర్ణయం తో, అక్రమ కట్టడాలపై మరింత కఠినంగా వ్యవహరించడానికి హైడ్రా సిద్దమవుతోంది.
హైదరాబాద్ నగరంలోని చెరువులు, నాలాల కబ్జాను అరికట్టేందుకు హైడ్రా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం బిజీగా ఉంది. కేటీఆర్ ఫామ్‌హౌస్ కూల్చివేతపై తాజా పరిణామాలు రాజకీయంగా కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
జన్వాడ ప్రాంతంలో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌కి సంబంధించి, హైడ్రా అధికారులు ఇప్పటికే సర్వే పూర్తి చేశారు.
కేటీఆర్ తన స్నేహితుడి ఫామ్‌హౌస్ అని ప్రకటించినప్పటికీ, అది ఎఫ్‌టీఎల్ లేదా బఫర్ జోన్‌లో ఉంటే తానే స్వయంగా కూల్చివేయిస్తానని ఆయన స్పష్టం చేశారు. కానీ, ఈ ఫామ్‌హౌస్ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించబడినట్లు అధికారులు గుర్తించారు.
ఇప్పటికే రూల్స్‌ను ఉల్లంఘించి నిర్మించిన భవనాలపై హైడ్రా తన ఉక్కు పాదం మోపుతూ వస్తోంది. ఇప్పుడు కేటీఆర్ ఫామ్‌హౌస్ కూడా ఈ జాబితాలో చేరినట్లు తెలుస్తోంది.
అధికారుల సర్వే అనంతరం, కూల్చివేత ఎప్పుడు జరుగుతుందనే దానిపై క్లారిటీ రాలేదు. ఇక ఇతర ప్రముఖుల ఫామ్ హౌస్‌లపై కూడా హైడ్రా కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.