అమరావతి: వైసీపీకి బిగ్ షాక్ గిలింది. ఆ పార్టీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్‌కు పంపించారు. జగన్ విధానాలు నచ్చక రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
బాలినేని గత కొంతకాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జగన్‌తో సమావేశమైనప్పటికీ, ఆయన అసంతృప్తి మారలేదు. వైసీపీకి తాను ఇక ఉండలేనని చెప్పిన బాలినేని, జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. రేపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో భేటీ కానున్నారు.