హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రియాలిటీ షోల్లో ఇప్పటివరకు అత్యంత ఎక్కువ ప్రజాదరణ పొందిన షో ‘బిగ్ బాస్‘. ఇప్పటి వారికి మూడు సీజన్ లు ముంగించుకుని మొన్ననే నాల్గవ సీజన్ ప్రారంభం అయింది. ప్రారంభం అయి మొదటి వారం పూర్తి చేసుకుంది. ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరూ పెద్దగా తెలియదు అనేటువంటి రూమర్స్ ఉన్నా కూడా జనాలు ఎక్కువమంది ఇళ్లకే పరిమితం అవడం వల్లనో ఏమో తెలియదు కానీ టెలివిజన్ టీఆర్పి రేటింగ్స్ మాత్రం ఈ షో కి దూసుకెళ్తున్నాయి.సీజన్ 3 హోస్ట్ చేసిన నాగార్జున నే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా చేస్తున్నాడు.
వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా కుమార్ సాయి అనే ఆక్టర్ ని తొందరగా హౌస్ లోకి పంపినా కూడా పాత సీజన్ లలో వచ్చిన ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పటివరకు ఈ సీజన్ లో రావట్లేదని టాక్. మామూలుగా వైల్డ్ కార్డు ఎంట్రీ లని కొంచెం టైం గ్యాప్ ఇచ్చి పంపుతారు. అలాంటిది ఈ సీజన్ లో నాలుగు రోజుల గ్యాప్ లో ఇద్దరినీ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ కి పంపారు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. ఇంత బాడ్ టాక్ ఉన్నా కూడా టీఆర్పి రేటింగ్స్ మాత్రం ఒక రేంజ్ లో నమోదు అవుతున్నాయి. నాగార్జున ప్రారంభించిన మొదటి ఎపిసోడ్ కి ఏకంగా 18 .5 రేటింగ్స్ తో ఇప్పటివరకు టాప్ పోసిషన్ లో ఉంది. ఈ విషయాన్నీ స్వయంగా నాగార్జున ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసారు.