హైదరాబాద్: టెలివిజన్ లో బిగ్గెస్ట్ రియాలిటీ షో గా బిగ్ బాస్ మంచి టీఆర్పి లు సాదిస్తుంది. హిందీ లో దాదాపు 10 సీజన్ లు ముగించుకున్న ఈ రియాలిటీ షో తెలుగు లో 3 సీజన్ లు కంప్లీట్ చేసుకొని నాలుగవ సీజన్ ప్రారంభించడానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 ని సెప్టెంబర్ 6 న ప్రారంభం అవబోతోందని స్టార్ మా వాళ్లు ఒక వీడియో ద్వారా ప్రకటించారు.
సీజన్ 1 కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా, సీజన్ 2 కి నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. సీజన్ 3 ఇపుడు సీజన్ 4 కి కూడా హోస్ట్ నాగార్జున. ప్రతీ సీజన్ లాగే ఈ సీజన్ కూడా పార్టిసిపంట్స్ ఎవరు వస్తారు అన్న దానిపై చాలా రూమర్స్ ఉన్నా కూడా ఎవరు రాబోతున్నారు అనేది చివరి వరకు సస్పెన్స్ మైంటైన్ చేస్తుంది స్టార్ మా టీం. సీజన్ 3 లో ఎలిమినేషన్స్ లాంటివి ముందే చాలా లీక్స్ రావడం తో ఈ సారి లీకులు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే కరోనా కారణంగా ఈ సీజన్ లో పాల్గొన బోయే పార్టిసిపంట్స్ ని ముందే ఐసోలేషన్ లో ఉంచినట్టు తెలుస్తుంది.పార్టిసిపంట్స్ అందరికి ఇప్పటికే పలుమార్లు కరోనా టెస్ట్ చేసి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సారి కరోనా వల్ల ఎక్కువ మంది ఇంట్లోనే కాబట్టి సీజన్ 4 ఇంకా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కానీ ఈ సీజన్ కి ఐపిఎల్ ఎఫెక్ట్ కొంచెం పడే అవకాశాలు ఉన్నాయి.