యూఎస్: మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన గర్ల్ ఫ్రెండ్ పౌలా హర్డ్ గురించి తొలిసారిగా బహిరంగంగా మాట్లాడారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, “నాకు పౌలా అనే సీరియస్ గర్ల్ ఫ్రెండ్ ఉండటం నా అదృష్టం. మేము కలిసి సమయాన్ని ఆస్వాదిస్తున్నాం” అని వెల్లడించారు.
ఒలింపిక్స్ సహా అనేక విశేష సంఘటనల్లో కలసి పాల్గొంటున్నామని తెలిపారు. గేట్స్, పౌలా హర్డ్ 2022 నుంచి వివిధ బహిరంగ కార్యక్రమాల్లో కలిసి కనిపిస్తున్నారు.
పౌలా హర్డ్, ఒరాకిల్ మాజీ సీఈఓ మార్క్ హర్డ్ భార్య. 2019లో భర్త మృతిచెందిన తర్వాత ఆమె బిల్ గేట్స్‌కు చేరువయ్యారు.
వారిద్దరి మధ్య ఉన్న బంధం గురించి గత కొంతకాలంగా వార్తలు వినిపించినప్పటికీ, గేట్స్ ఇప్పుడే అధికారికంగా ధృవీకరించారు.
గేట్స్ 2021లో తన భార్య మిలిండా ఫ్రెంచ్‌తో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతోంది.
పౌలా హర్డ్‌తో సంబంధాన్ని అంగీకరించడం ద్వారా, గేట్స్ మరో కొత్త అధ్యాయం మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది.