
కోలీవుడ్: ఒకరేమో దాదాపు ఇరవై సంవత్సరాలు తెలుగు, తమిళ సినిమా సంగీతాన్ని ఏలిన రారాజు, ఇంకొకరేమో దాదాపు ముప్పై సంవత్సరాలుగా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరున్న డైరెక్టర్. వాళ్ళు ఎవరో కాదు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, మరొకరు ప్రముఖ దర్శకుడు మణి రత్నం.ఈ ఇద్దరు సినీ లెజెండ్స్ ఒకే పుట్టిన రోజు ని షేర్ చేసుకుంటున్నారు. ఈ రోజు ఈ ఇద్దరు లెజెండ్స్ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
తెలుగు, హిందీ, తమిళ్ మరియు ఇతర భాషల్లో దాదాపు ఏడు వేలకు పైగా పాటలు కంపోజ్ చేసిన ఘనుడు, 80 ,90 దశకాల్లో తెలుగు, తమిళ భాషల్లో ఈయన స్వరపరచిన పాట కాకుండా వేరే కంపోజర్ పాట లేదు అనడం అతిశయోక్తి కాదు. సినీ సంగీత ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన లెజెండ్ ఇళయరాజా. ఇప్పటికీ కొన్ని సినిమాలతో మళ్ళీ మళ్ళీ తన స్వరాలని వినిపిస్తుండాడు. ఈయన పాటల్లో బాగుంటాయి అని లిస్ట్ తీస్తే ఆ లిస్ట్ వేరే సంగీత దర్శకులు కంపోజ్ చేసిన పాటల అంత కౌంట్ వస్తుంది అంటే అర్ధం చేసుకోవచ్చు ఎన్ని అద్భుతమైన పాటలు ఇచ్చారో. ఈ సందర్భంగా ఈ లివింగ్ లెజెండ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తుంది ‘టూ స్టేట్స్’ టీం.
దాదాపు ముప్పై సంవత్సరాలుగా ప్రతీ నటుడు పని చేయాలనుకునే దర్శకుడి లిస్ట్ లో మొదట ఉండే దర్శకుడు, ప్రతీ టెక్నీషియన్ పని చేయాలనుకునే దర్శకుడి లిస్ట్ లో మొదటి పేరు ‘మణి రత్నం’ ది ఉంటుంది అనడం లో సందేహం లేదు. 1983 లో దర్శకుడిగా పరిచయం అయిన ఈ దర్శకుడు 1986 లో వచ్చిన మౌన రాగం తో కల్ట్ దర్శకుడిగా పేరు పొందాడు. ఆ తర్వాత నాయకుడు, అంజలి, గీతాంజలి ఇక రోజా సినిమా తర్వాత సినీ వినీలాకాశంలో అందనంత ఎత్తుకు ఎదిగాడు. ఈయన సినిమాలు మూవీ టెక్నీషియన్స్ కి ఒక ఎన్సైక్లోపీడియా లాగ, ఒక డిక్షనరీ లాగా, ఒక కేస్ స్టడీ లాగా ఉంటాయి అని చాలా మంది చెప్తూటున్నారు. ఆయన రూపొందించిన సినిమాల్లో ఫ్రేమింగ్స్, డిటైలింగ్స్ అలా ఉంటాయి మరి. ఇలాంటి లివింగ్ లెజెండ్ ‘మణి రత్నం’ కి ఈరోజు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందజేస్తుంది ‘టూ స్టేట్స్’ టీం.