న్యూయార్క్: బిట్‌కాయిన్ గడచిన కొద్ది రోజుల నుండి చాలా ఒడిదుడుకులను చవిచూసింది. ఇటీవల బిట్‌కాయిన్‌కు ఎల్ సాల్వడార్ దేశం చట్టబద్దతను కల్పించింది. అయితే ఇలా చట్టబద్దతను కల్పించడంతో ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. అందువల్ల బిట్‌కాయిన్‌లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. అయితే ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ తిరిగి పుంజుకుంది.
ఇదిలా ఉండగా బిట్‌కాయిన్‌పై బ్లూమ్‌బర్గ్ విశ్లేకుడు మైక్ మెక్‌గ్లోన్ ఒక సంచలన ప్రకటన చేశాడు. అ ప్రకటన ప్రకారం బిట్కాయిన్ ఈ సంవత్సరం చివరి కల్లా బిట్‌కాయిన్ విలువ ఒక లక్ష డాలర్ల (అంటే సుమారు రూ. 73.65 లక్షల)కు చేరుకుంటుందని తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రిప్టోకరెన్సీలో అత్యధికంగా బిట్‌కాయిన్‌ను ఎక్కువ మంది ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
దీని వల్ల బిట్‌కాయిన్ 2021 చివర్లో గణనీయమైన పురోగతిని సాధించే అవకాశం ఉందని తెలిపారు. బిట్‌కాయిన్ పూర్వ ట్రేడింగ్ గణాంకాలను ఆధారంగా చేసుకొని బిట్‌కాయిన్ విలువ రెట్టింపు అవుతోందని అభిప్రాయపడ్డారు. 2021 ఏప్రిల్-మేలో జరిగిన బిట్‌కాయిన్ క్రాష్‌తో ప్రస్తుత ట్రేడింగ్ గణాంకాలతో సరిసమానం చేసుకుందని, భవిష్యత్తులో బిట్‌కాయిన్ భారీ ర్యాలీని నమోదుచేస్తోందని వెల్లడించారు.
కాగా ప్రస్తుతం బిట్‌కాయిన్ విలువ 45,542 డాలర్ల (సుమారు రూ. 33.54 లక్షలు) వద్ద ట్రేడింగ్ జరుగుతోంది. బిట్‌కాయిన్ త్వరలోనే 50వేల డాలర్ల మార్కును దాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.