వయనాడ్ ఉపఎన్నిక: కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. ఈసారి బీజేపీ తరపున నవ్య హరిదాస్ బరిలో నిలవనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తుండగా, ఈ రెండు పార్టీల మధ్య ఆసక్తికర పోటీ నెలకొంది.
నవ్య హరిదాస్ కోజీకోడ్ కార్పొరేషన్‌లో కౌన్సిలర్‌గా పనిచేశారు. ప్రస్తుతం కేరళ రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల బీజేపీ అసోం, బీహార్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరగనున్న ఉప ఎన్నికల అభ్యర్థులను ప్రకటించింది. కేరళలో వయనాడ్ నుండి ప్రియాంక గాంధీపై పోటీ చేయడం ద్వారా బీజేపీ తమ పార్టీకి మద్దతు పెరగాలనే లక్ష్యంతో నవ్య హరిదాస్‌ను రంగంలోకి దింపింది.
నవంబర్ 13న ఉప ఎన్నిక జరగనుండగా, నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు పట్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ప్రత్యేకంగా వయనాడ్ నియోజకవర్గం అతి ప్రధానమైనదిగా మారడంతో, ఈ సారి పోటీ మరింత రసవత్తరంగా మారనుంది.