విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలోకి చేర్చి చికిత్స అందిస్తోంది. కాగా, తాజాగా బ్లాక్ ఫంగస్(మ్యుకర్ మైకోసిస్) చికిత్సను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. కొద్దిరోజుల కిందటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇవాళ దీనికి సంబంధించిన ఉత్తర్వులు రావడంతో అధికారికంగా ఇక ఈ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చును మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కోవిడ్ రోగులు కోలుకున్న తరువాత వారు బ్లాక్ ఫంగస్ వ్యాధి బారిన పడి ఇబ్బంది పడుతున్నారు. ఏపీ లో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులు చిత్తూరులో 3, కర్నూలులో 2, అనంతపురంలో 2, శ్రీకాకుళంలో 1, నెల్లూరులో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ ఈ నిర్ణయంతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందబోతున్నాయి.