మూవీడెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షోలో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన లేకుండా చూసుకుంటున్నారని ఇటీవల తారక్ ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
డాకు మహారాజ్ ఎపిసోడ్ లో కూడా ఎన్టీఆర్ గురించి ప్రస్తావన లేకపోవడం వివాదానికి దారితీసింది.
తారక్ ఫ్యాన్స్ బాలయ్యపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు.
ఇప్పటికే ఈ అంశంపై నిర్మాత నాగవంశీ స్పందించి, బాలయ్య తారక్ గురించి ఆఫ్ ది రికార్డ్ మాట్లాడారని వెల్లడించారు.
తాజాగా డాకు మహారాజ్ ప్రెస్ మీట్ లో దర్శకుడు బాబీ కూడా ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చారు.
షోలో ఎన్టీఆర్ పిక్ లేకపోవడం వాస్తవమే కానీ, దానికి ఎటువంటి ప్రత్యేక కారణం లేదని తెలిపారు.
షూటింగ్ బ్రేక్ సమయంలో బాలయ్య తారక్ గురించి మంచి మాటలు చెప్పారన్నారు.
జై లవకుశ సినిమా తనకు బాగా నచ్చిందని, తారక్ పాత్రపై ప్రశంసలు కురిపించారన్నారు.
ఈ విషయాలు రికార్డింగ్ లో లేకపోవడంతో బయటకు రాలేదని బాబీ తెలిపారు.
తారక్ ఫ్యాన్స్ ఆందోళన అనవసరమని, అసలు ఎలాంటి తేడా లేదని బాబీ స్పష్టం చేశారు.
బాలయ్య, తారక్ మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పిన ఆయన, ఈ రూమర్స్ విభేదాలు సృష్టించవద్దని కోరారు.