fbpx
Sunday, January 19, 2025
HomeMovie Newsబాబీ సింహా 'వసంత కోకిల' ఫస్ట్ లుక్

బాబీ సింహా ‘వసంత కోకిల’ ఫస్ట్ లుక్

BobbySimha LatestMovie VasanthaKokilaFirstLook

టాలీవుడ్: బాబీ సింహా అంటే తెలుగులో ఎక్కువ తెలియదు కానీ తమిళ్ లో బాగా ఫేమస్. తెలుగు లో ‘డిస్కో రాజా’ ద్వారా పరిచయం అయ్యాడు ఈ నటుడు. కానీ డబ్బింగ్ సినిమాలు చూసే వారికి పరిచయమే. తెలుగులో గద్దల కొండ గణేష్ గా వచ్చిన మాతృక లో విలన్ గా నటించి నేషనల్ అవార్డు గెలిచిన నటుడు ‘బాబీ సింహా’. తమిళ్ లో చాలా గుర్తింపు ఉన్న పాత్రలు చేసాడు ఈ యువ నటుడు. ఇప్పుడు హీరోగా ‘వసంత కోకిల’ అనే సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ లో రూపొందిస్తున్నారు. తమిళ్ లో ‘వసంత ముల్లై’ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు మరియు కన్నడ లో డబ్ అవుతుంది.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ని తెలుగు లో రానా దగ్గుబాటి, తమిళ్ లో ధనుష్, కన్నడ లో రక్షిత్ శెట్టి విడుదల చేసారు. డిస్కో రాజా ని నిర్మించిన నిర్మాతలే ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి సమర్పణలో రజినీ తాళ్లూరి, రేష్మీ సింహా నిర్మిస్తున్నారు. రమణన్ పురుషోత్తమ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నాడు. ప్రేమమ్, నేరం సినిమాలకి అద్భుతమైన సంగీతం అందించిన ‘రాజేష్ మురుగేషన్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఒక కమర్షియల్ థ్రిల్లర్ లాగా ఈ సినిమా రూపొందుతుందని ఫస్ట్ లుక్ చూస్తే అర్ధం అవుతుంది. బాబీ సింహ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ అయితే సోషల్ మీడియా లో బాగానే రీచ్ అయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular