కోలీవుడ్: గద్దలకొండ గణేష్ ఒరిజినల్ వెర్షన్ జిగర్తాండ సినిమాలో నటించి నేషనల్ అవార్డు సాధించిన బాబీ సింహా హీరో గా ‘వసంత కోకిల’ అనే సినిమా రూపొందుతుంది. బాబీ సింహా కి తెలుగులో అంతగా గుర్తింపు లేదు కానీ తమిళ్ లో మంచి నటుడిగా సాగుతున్నాడు. తెలుగులో రవి తేజ హీరో గా రూపొందిన ‘డిస్కో రాజా’ సినిమాలో కనిపించాడు. ఆ సినిమా రూపొందించిన ఎస్.ఆర్.టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది. నర్తన శాల సినిమాలో నాగ శౌర్య జోడీ గా నటించిన కాశ్మీర పరదేశి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
టీజర్ ఆరంభం లో అండర్ వాటర్ షాట్స్ తో మొదలు పెట్టి తర్వాత థ్రిల్లర్ ఎలిమెంట్స్ ని చూపించనున్నట్టు కొన్ని షాట్స్ పెట్టారు. ఈ సినిమాలో ట్రాప్, స్ట్రేజ్, మిస్టీరియస్, పెయిన్, కన్ఫ్యూజన్ లాంటి అంశాలతో కూడిన కథ ఉన్నట్టు ప్రెసెంట్ చేసారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా మూడు భాషల్లో విడుదలవనుంది. ఈ సినిమాని తెలుగు, తమిళ్ , కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు.
‘ప్రేమమ్’ సినిమాకి సంగీతం అందించిన రాజేష్ మురుగేషన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదలైన రెండు పాటలు కూడా మెలోడియస్ గా ఆకట్టుకున్నాయి. రామ్ తాళ్లూరి సమర్పణలో ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ , మద్రాస్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై రజినీ తాళ్లూరి , రేష్మీ సింహా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రమణన్ పురుషోత్తమ అనే నూతన దర్శకుడు ఈ థ్రిల్లర్ సినిమాని తెరకెక్కించాడు. వేవ్ 3 ముగిసి థియేటర్ లు తెరచుకోగానే ఈ సినిమాని విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.