విశాఖపట్నం: విశాఖలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు
విశాఖపట్నం విమానాశ్రయంలో బాంబు బెదిరింపు సందేశం కలకలం రేపింది. ఇండిగో విమానంలో బాంబు పెట్టినట్లు ఓ అనామక వ్యక్తి ఆడమ్ లామ్జా202 అనే ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) ఖాతా ద్వారా సందేశం పోస్ట్ చేయడంతో, అప్రమత్తమైన ఇండిగో ఎయిర్‌లైన్స్ అధికారులు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. చెన్నై-విశాఖ-బెంగళూరు రూట్లో వెళ్తున్న విమానాన్ని విశాఖ విమానాశ్రయంలో నిలిపివేయించి, అప్రమత్తత చర్యలు చేపట్టారు.
ఇండిగో ప్రాంతీయ కార్యాలయ అధికారి నుంచి సందేశం అందుకున్న విమానాశ్రయ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, విశాఖ స్టేషన్ మేనేజర్‌కు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విమానాన్ని నిలిపివేసి ప్రయాణికులను కిందకు దింపి, సిబ్బంది సహకారంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. బాంబు బెదిరింపుతో సంబంధం ఉన్న అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు విశాఖ ఎయిర్పోర్ట్ అధికారులు ప్రకటించారు.
ప్రస్తుతానికి ప్రయాణికుల సురక్షితంగా ఉండేందుకు అనుమానాస్పద వస్తువులు, బంగారు వస్తువులు, బ్యాగులు అన్ని పరిశీలించి ఎటువంటి ముప్పు లేదని నిర్ధారించారు. కాగా ఈ ఘటనపై మరింత సమాచారం కోసం దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.