టాలీవుడ్: కరోనా కారణంగా థియేటర్లు మూసివేసిన తర్వాత ఓటీటీ ల హవా బాగా పెరిగింది. ఒకప్పుడు థియేటర్లో విడుదలై బాగా ఆడితే ఒక 30 నుండి 50 రోజుల తర్వాత ఓటీటీలలో ప్రత్యక్షం అయ్యే సినిమాలు ఇపుడు డైరెక్ట్ గా ఓటీటీ ల్లోనే విడుదల అవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఎక్కువ రీజనల్ సినిమాలు విడుదల చేస్తూ ముందు వరుసలో ఉంది. తెలుగులోనే ఇప్పటికి ఒక అరడజను చిన్న సినిమాలు విడుదల చేసిన ఈ ఓటీటీ ఇపుడు మరో సినిమాని విడుదల చేస్తుంది. ‘ఈ నగరానికి ఏమైంది‘ అనే సినిమా ద్వారా పరిచయం అయిన సుశాంత్ హీరోగా , చాందిని చౌదరి మరియు సిమ్రాన్ హీరోయిన్ లుగా నటించిన ‘బొంబాట్’ అనే సినిమా డిసెంబర్ లో ఓటీటీ లో విడుదల కానుంది.
ఈ సినిమాకి సంబందించిన టీజర్ ఇవాల విడుదల అయింది. టీజర్ చూస్తుంటే ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా జానర్ అనిపిస్తుంది. ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ మరియు లవ్ స్టోరీ కి సంబందించిన అంశాలు ఎక్కువగా టచ్ చేసారు. ట్రైలర్ ఈ వారంలో విడుదల చేయనున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై విశ్వాస్ హన్నూర్కర్ ఈ సినిమాని నిర్మించాడు. రాఘవేంద్ర వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డిసెంబర్ 3 నుండి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా విడుదల కానుంది.