ఇటీవల బుక్ మై షో యాప్‌పై సినీ నిర్మాతల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. టికెట్ బుకింగ్ యాప్‌గా ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు సినిమాల హిట్, ఫ్లాప్ నిర్ణయించే స్థాయికి చేరిందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
టీజర్, ట్రైలర్, బజ్ కంటే ముందు ‘ఇంటరెస్టింగ్’ కౌంట్ చూసే ట్రెండ్ ఏర్పడటం వల్ల, అసలు ప్రేక్షకుల స్పందన ఎలా ఉందనేది మరుగున పడుతోందని నిర్మాతలు అంటున్నారు.
ముఖ్యంగా మిడిల్ రేంజ్ సినిమాలకు వాస్తవిక స్పందన రాకపోవడంతో, బుక్ మై షోలో బాట్స్ ద్వారా ఫేక్ ఇంటరెస్ట్ కౌంట్లు పెంచుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. టికెట్ బుక్ చేయని యూజర్లకూ ఓటింగ్ అవకాశముండటం వల్ల, ఫలితాలపై తప్పుడు అభిప్రాయాలు ఏర్పడుతున్నాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
అంతేకాదు, బుక్ మై షో కొన్ని మల్టీప్లెక్స్‌లలో వాటాలు కలిగి ఉండటం, కొన్ని ప్రొడక్షన్‌లకు పెట్టుబడులు ఇవ్వడం వంటి విషయాలు కూడా డిస్కషన్‌కు వస్తున్నాయి.
ఈ వ్యవహారంపై నిర్మాతల గిల్డ్ నుంచి అధికారిక స్పందన లేకపోవడం వల్ల, అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు అయినా పరిశ్రమ అంతా ఒక్కటై, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల తీరుపై స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాలన్న డిమాండ్ ఊపందుకుంది.