ఏపీ: రాజకీయాల్లో కీలక నేత బొత్స సత్యనారాయణ భవిష్యత్తు దిశగా అనేక ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కూడా బొత్స పార్టీకి మద్దతుగా వ్యవహరిస్తున్నా, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన సాన్నిహిత్యం పెరుగుతుందనే వార్తలు చర్చనీయాంశంగా మారాయి.
ఇటీవల అసెంబ్లీ ఆవరణలో బొత్స, పవన్ కల్యాణ్‌ను ప్రత్యేకంగా కలుసుకుని ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇదే సమయంలో బొత్స వైఖరిపై వైసీపీ వర్గాల్లో అనుమానాలు పెరిగాయి.
గతంలో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో కలిసి ఉండగానే, ఆయన పవన్ కల్యాణ్‌ను కలుసుకోవడం రాజకీయ అర్థం ఏమిటనే చర్చను తెరపైకి తెచ్చింది.
వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ భవిష్యత్తుపై అనేక నేతలు ఆలోచనలో పడగా, బొత్స కూడా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆయన ఉత్తరాంధ్రలో బలమైన నేత కావడంతో, భవిష్యత్ రాజకీయ అవకాశాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కువగా జనసేనలో చేరే అవకాశాలున్నాయి ఉన్నాయని గాసిప్స్ పుట్టుకొస్తున్నాయి. మరి ఈ విషయంలో ఆయన ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.