మూవీడెస్క్: ఎన్టీఆర్ vs విజయ్! ఈ ఏడాది సంక్రాంతి బాక్సాఫీస్‌ను వెంకటేశ్ “సంక్రాంతికి వస్తున్నాం” శాసించగా, బాలకృష్ణ “డాకు మహారాజ్” హిట్ టాక్‌తో దూసుకెళ్లాడు.
ఇక రామ్ చరణ్ “గేమ్ చేంజర్” డిజాస్టర్‌గా మిగిలింది. వచ్చే సంక్రాంతి గురించి మాత్రం ముందుగానే హైప్ మొదలైంది.
2026 సంక్రాంతికి ఎన్టీఆర్, విజయ్ మధ్య ఘాటు పోటీ ఉంటుందని టాక్.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయబోతున్నారు.
“డ్రాగన్” టైటిల్ ప్రచారంలో ఉండగా, ఈ సినిమా కోసం భారీ యాక్షన్ ఎలిమెంట్స్‌ను ప్లాన్ చేస్తున్నారట.
జనవరి 2026న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు.
అదే సమయంలో విజయ్ “జన నాయగన్” అనే పొలిటికల్ డ్రామాతో వస్తున్నారు.
హెచ్ వినోత్ దర్శకత్వం వహిస్తుండగా, పూజా హెగ్డే ఈ చిత్రంలో కథానాయికగా కనిపించనుంది.
“భగవంత్ కేసరి” రీమేక్‌గా వస్తుందా? లేదా వేరే స్క్రిప్ట్‌తో రూపొందిస్తారా అనే సందేహాలు ఉన్నాయి.
ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పోరులో ఎన్టీఆర్ మాస్ అప్పీల్, విజయ్ రాజకీయ డ్రామా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించనున్నాయి.
మరి ఈ రెండు భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద ఏం చేస్తాయో వేచి చూడాలి.