మూవీడెస్క్: నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ సినిమాలు టాలీవుడ్‌లో సంచలన విజయాలను నమోదు చేశాయి. ఇప్పుడు అఖండ 2 కోసం బోయపాటి శ్రీను కొన్ని ఆసక్తికర మార్పులను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కాంబినేషన్ సినిమాలపై అభిమానులలో ఉన్న హైప్ విపరీతంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అఖండ సీక్వెల్‌పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం దేశ, విదేశీ నటులను పరిశీలిస్తున్నారు.
ముఖ్యంగా చైనీస్ లేదా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వ్యక్తిని విలన్‌గా పెట్టాలని బోయపాటి భావిస్తున్నట్లు సమాచారం. ఇది సినిమా కథని మరింత రసవత్తరంగా మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
అంతేకాకుండా, అఖండ 2లో 16 నుంచి 18 ఏళ్ళ వయస్సు గల భారతీయ యువతికి కూడా ఓ కీలక పాత్ర ఇవ్వబోతున్నారు.
ఇందులో భాషకు ఎలాంటి పరిమితి లేకుండా యాక్టింగ్ నైపుణ్యాలు కలిగిన వారు దరఖాస్తు చేయవచ్చని చిత్ర బృందం పేర్కొంది.
ఈ ప్రక్రియలు చూస్తుంటే అఖండ 2 మరింత గ్రాండ్‌గా, పాన్ ఇండియా స్థాయిలో రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.