మూవీడెస్క్: తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన రష్మిక మందన్న, పుష్ప 2తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందింది.
‘గీత గోవిందం’ నుంచి ‘పుష్ప’ వరకూ రష్మిక అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి తన క్రేజ్ పెంచుకుంది.
పుష్ప 2 విజయంతో దేశవ్యాప్తంగా తన స్థానాన్ని మరింత బలపరచుకుంది.
అయితే ఈ సక్సెస్ అనంతరం బిజీ షెడ్యూల్‌లో ఉన్న రష్మికకు ఇటీవల జిమ్‌లో గాయం కావడంతో కొంత బ్రేక్ పడింది.
వైద్యుల సూచనతో తక్షణ విశ్రాంతి తీసుకుంటున్న రష్మిక త్వరలోనే తిరిగి సెట్స్‌లోకి రావడానికి సిద్ధమవుతోంది.
ఆమె గాయంతో ‘సికందర్’ చిత్ర షూటింగ్ కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.
ఈద్ 2025కి రిలీజ్ కానున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, కాజల్ అగర్వాల్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
సల్మాన్ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. రష్మిక హిందీ మార్కెట్‌లో తన స్థానం బలపరుచుకునే అవకాశం ఉన్న ఈ ప్రాజెక్ట్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.
ఇకపోతే రష్మిక తెలుగు పరిశ్రమలోనూ పలు ప్రాజెక్టులలో నటిస్తోంది.
శేఖర్ కమ్ముల ‘కుబేర’తో పాటు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాతో బిజీగా ఉంది.