మూవీడెస్క్: తెలుగు సినిమాలు గత కొన్నేళ్లుగా అమెరికా మార్కెట్‌లో స్ట్రాంగ్ హోల్డ్ సాధించాయి.
చిన్న సినిమా అయినా మిలియన్ మార్క్ సాధించడం సాధారణం అయింది. కానీ, తాజాగా ఈ ట్రెండ్ కాస్త మారుతున్నట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా తాజా విడుదలైన తండేల్ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను ఎదుర్కొంది.
నాగ చైతన్య, సాయి పల్లవి వంటి స్టార్ కాంబినేషన్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు $700K మాత్రమే వసూలైంది.
ఈ మార్పుకు ముఖ్య కారణం అమెరికాలోని తాజా ఇమ్మిగ్రేషన్ విధానాలేనా? అనే చర్చ నడుస్తోంది.
ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నియంత్రణలు విద్యార్థుల ఆదాయంపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
పార్ట్ టైమ్ ఉద్యోగాల్లో నియంత్రణలు పెరగడంతో థియేటర్లకు వెళ్లే తెలుగు ప్రేక్షకుల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది.
అంతేకాదు, టికెట్ ధరల పెరుగుదల కూడా ప్రభావం చూపిస్తోంది.
ఈ పరిస్థితి రాబోయే సినిమాలపై ఎలా ఉండబోతోందనే ప్రశ్న ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇకపోతే, రాబోయే పెద్ద సినిమాలు ఈ ట్రెండ్‌ను బ్రేక్ చేస్తాయా? లేక టాలీవుడ్‌కు యూఎస్ మార్కెట్‌లో కొత్త సవాళ్లు ఎదురవుతాయా? అనేది చూడాలి.