fbpx
Sunday, December 22, 2024
HomeInternationalమహిళల హాకీ జట్టు ఓడినా కాంస్యం గెలిచే అవకాశం!

మహిళల హాకీ జట్టు ఓడినా కాంస్యం గెలిచే అవకాశం!

BRONZE-MEDAL-OPPORTUNITY-ALIVE-FOR-INDIAN-WOMEN-HOCKEY-TEAM

టోక్యో: టోక్యో ఒలింపిక్స్ 2021‌లో అర్జెంటీనాతో జరిగిన మహిళల హాకీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఓటమి పాలయింది. కాగా భారత మహిళల జట్టు సెమీస్‌లో ఓడినా అభిమానుల మనసులు మాత్రం గెలిచింది. సుమారు 41 సంవత్సరాల తరువాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో సెమీస్‌ దాటి ఫైనల్ చేరుతుందని అందరూ ఆశించారు.

అయితే సెమీస్ లో అర్జెంటీనాతో జరిగిన ఆట మొదట్లోనే గుర్జీత్‌ కౌర్‌ గోల్‌ చేసి భారత జట్టు‌కు శుభారంభం లభించింది. కానీ ఆ ఆనందం ఎక్కువసేపు నిలబడలేదు. అర్జెంటీనా కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్ట‌ర్‌లో 1-0 లీడ్‌లోకి దూసుకెళ్లిన టీమిండియా మళ్ళీ రెండు, మూడు క్వార్ట‌ర్ల‌లో రెండు గోల్స్ ప్ర‌త్య‌ర్థికి సమర్పించుకుంది.

కానీ భారత్ కు నాలుగో క్వార్ట‌ర్‌లో రాణి రాంపాల్ టీమ్‌కు స్కోరు స‌మం చేసే అవ‌కాశం దక్కలేదు. కాగా భారత‌ జట్టు సెమీస్‌లో ఓడినప్పటికి రాణి రాంపాల్‌ సేనకు ఇంకొక సువర్ణావకాశం మిగిలే ఉంది. కాంస్య పతకానికి జరిగే పోరులో భాగంగా ఆగస్టు 6వ తేదీన బ్రిటన్‌తో జరగనున్న ఈ మ్యాచ్‌లో భారత జట్టు గనుక‌ గెలిస్తే అది ఒక కొత్త చరిత్రే అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ జట్టు ఇంతవరకు ఎటువంటి పతకాన్ని సాధించలేదు. ఈ మ్యాచ్ లో గెలిస్తే భారత జట్టుకు కాంస్యం దక్కడం కూడా ఒక చరిత్రే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular