హైదరాబాద్: తెలంగాణ లో వరద బాధితుల సహాయార్థం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు వారి వంతు విరాళం ప్రకటించారు.
సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని తెలిపారు.
దీనితో బీఆరెస్ పార్టీకి చెందిన అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఎంపీలు వారి ఒక నెల జీతాన్ని విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
కాగా ఇటీవల వచ్చిన వర్షాలు మరియు వరదల కారణంగా సర్వం కోల్పోయి ఇబ్బందిపడుతున్న ప్రజల కోసం అండగా ఉంటామని, ఇప్పటికే తమ పార్టి పక్షాన సహాయక చర్యలు చేస్తునట్లు తెలియజేశారు.
వారితో పాటుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యుల ఒక నెల జీతాన్ని విరాళంగా వారికి అందిస్తామన్నారు.
ఎప్పుడూ ప్రజల కష్టాల్లో అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, ఇప్పుడు కూడా ప్రకృతి విలయంలో ప్రజలతో ప్రజల పక్షాన ఉందన్నారు.
అలాగే రాష్ట్రంలోని ప్రజలందరూ వరద బాధితుల సహాయార్థం వారి వంతు సాయం చేయడానికి ముందుకు రావాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు.