ప్రైవేట్ టెలికం సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేలా BSNL మరోసారి ముందడుగు వేసింది. ఈసారి శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో కీలక మార్పును తీసుకొస్తోంది. ప్రముఖ శాటిలైట్ కంపెనీ ‘వియాసాట్’ తో కలిసి BSNL డైరెక్ట్ టు డివైజ్ (డీటుడీ) టెక్నాలజీని పరిచయం చేయనుంది.
ఈ టెక్నాలజీ ద్వారా సిమ్‌కార్డు అవసరం లేకుండానే నేరుగా శాటిలైట్ ద్వారా కనెక్టివిటీ పొందొచ్చని BSNL అధికారికంగా ప్రకటించింది.
ఈ డీటుడీ టెక్నాలజీ ఆండ్రాయిడ్, ఐవోఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది. స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ కార్లు, ఇతర స్మార్ట్ డివైజ్‌లకు కూడా సపోర్ట్ చేయనుంది. గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా మారబోతుంది.
కనెక్టివిటీ లేకుండా మొబైల్ టవర్లను అన్వేషించాల్సిన అవసరం లేకుండా, నేరుగా శాటిలైట్ ద్వారా సేవలను పొందవచ్చు.
ఇప్పటికే ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న శాటిలైట్ ద్వారా కాల్ చేయడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ పొందడం లాంటి ముఖ్యమైన అంశాలు విజయవంతంగా పరీక్షించబడ్డాయి. ఈ టెక్నాలజీ పట్ల BSNL కూడా మంచి అంచనాలు పెట్టుకుంది.
BSNL innovation, satellite connectivity, direct-to-device technology, rural communication, telecom revolution,