న్యూఢిల్లీ: భారత దేశ ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇవాళ కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించిన దాని ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు ప్రాభవితమవనున్నాయి.
నూతన బడ్జెట్ ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు ఇకపై తక్కువ ధరకే లభించబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీని 5 శాతానికి తగ్గించారు.
భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే..
ధర తగ్గిన వస్తువులు:
బట్టలు
రత్నాలు,వజ్రాలు, అనుకరణ ఆభరణాలు
మొబైల్ ఫోన్లు
మొబైల్ ఫోన్ ఛార్జర్లు
పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు
స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఎడాదిపాటు వర్తించనుంది.
ధర పెరిగే వస్తువులు:
అన్ని దిగుమతి వస్తువులు
గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.
క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు