న్యూఢిల్లీ: దేశంలో కరోనా కష్ట కాలం గడచిన తర్వాత ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ కావడంతో దేశమంతా ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూసింది. ఈ రోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగబోయే నాలుగు రాష్ట్రాలకు అత్యధిక కేటాయింపులు జరగడం ఇక్కడ ప్రధాన అంశం.
మొత్తం బడ్జెట్‌ను శాఖలవారీగా పరిశీలిస్తే కేటాయింపులు ఈ రకంగా ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో యథావిధిగా అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయింపులు దక్కాయి. దాని తర్వాత వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖకు అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ.
రక్షణ రంగానికి రూ.4.78 లక్షల కోట్లను కేటాయించారు. దీనిలో మూలధన వ్యయం రూ.1.35 లక్షల కోట్లు ఉంది. అయితే గత ఏడాదితో పోలిస్తే మూలధన వ్యయం 19 శాతం పెరగడం గమనార్హం. ఈ విషయమై లోక్‌సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. 15 ఏళ్లలో రక్షణ రంగంలో ఈ స్థాయి మూల ధన వ్యయం లేదని తెలిపారు.
తదుపరి అత్యధిక కేటాయింపులు దక్కిన రెండో శాఖ: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ. ఈ శాఖకు రూ. 2,56,948 కోట్లు కేటాయించారు.
హోం మంత్రిత్వ శాఖ: రూ.1,66,547 కోట్లు
గ్రామీణాభివృద్ధి శాఖ: రూ.1,33,690 కోట్లు
వ్యవసాయ, రైతుల సంక్షేమం: రూ.1,31,531 కోట్లు
రోడ్డు రవాణా, జాతీయ రహదారులు : రూ.1,18,101 కోట్లు
రైల్వేలు: రూ.1,10,055 కోట్లు
విద్యా శాఖ : రూ.93,224 కోట్లు
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ : రూ.73,932 కోట్లు
గృహ, పట్టణ వ్యవహారాల శాఖ : రూ.54,581 కోట్లు
కొవిడ్ వ్యాక్సినేషన్‌కు రూ.35 వేల కోట్లు కేటాయించడం విశేషం.
స్వచ్ఛ భారత్: రూ.1,41,678 కోట్లు
ఆత్మ నిర్భర్ స్వస్థ్ యోజన అనే కొత్త పథకం ప్రారంభించారు. ఈ పథకానికి తొలి కేటాయింపులు రూ.64,180 కోట్లు