న్యూఢిల్లీ: ఎన్డీయే మూడో సారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేశాక తొలిసారి పూర్తి స్థాయి పార్లమెంటు సమావేశాలు ఈ నెల జులై 22వ తేదీ నుండి ఆగస్టు 12వ తేదీ వరకు జరగనున్నాయి. దీనితో పాటు బడ్జెట్ కూడా ప్రవేశ పెట్టనున్నారు.
ఈ సారి కూడా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జులై 23వ తేదీన పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. కాగా ఈ బడ్జెట్-2024 సన్నాహాలు తుది దశకు చేరిన సందర్భంగా, ఎప్పటి నుండో వస్తున్న సంప్రదాయం ప్రకారం పార్లమెంటులో నిర్మలా సీతారామన్ హల్వా తయారుచేశారు.
ఈ కార్యక్రమంలో ఆమె ఆర్థిక శాఖ అధికారులకు, పార్లమెంటు సిబ్బందికి స్వయంగా హల్వాను వడ్డించారు. ఈ కార్యక్రమం పార్లమెంటు భవనంలోని నార్త్ బ్లాక్ లో జరిగింది.