ఒక్క హిట్ పడితే చాలు, సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టుల క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో చిన్న నటుడు బుల్లిరాజు కూడా అటువంటి గుర్తింపును అందుకున్నాడు. వెంకటేష్ కొడుకు పాత్రలో కనిపించిన బుల్లిరాజు తన అద్భుత నటనతో అందరి మనసును దోచేశాడు.
ఈ సినిమా బిగ్ హిట్ కావడంతో బుల్లిరాజుకు డిమాండ్ భారీగా పెరిగింది. అతని స్క్రీన్ ప్రెజెన్స్, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో అతడికి మరిన్ని ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, బుల్లిరాజు ఒక రోజుకు రూ.1 లక్ష రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడు. చిన్న వయసులోనే సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టుల స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని టాక్. ఇప్పటికే అతడికి 15 సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఆఫర్లు వచ్చాయని, అయితే అతను పరిమిత ప్రాజెక్టులను మాత్రమే ఎంచుకుంటున్నాడని తెలుస్తోంది.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో, ఈ సినిమాలో కూడా బుల్లిరాజుకు ఓ కీలక పాత్ర ఉంటుందని సమాచారం. మరి, ఈ బుడతడు మరోసారి హై రేంజ్ లో అలరించనున్నాడా? అనేది ఆసక్తిగా మారింది.