ముంబై: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండడం అనుమానాస్పదమవుతోంది. వెన్ను గాయంతో ఇబ్బందిపడుతున్న బుమ్రా ఇప్పటికీ పూర్తి ఫిట్‌నెస్ సాధించలేకపోయినట్లు సమాచారం.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, బుమ్రా 100 శాతం ఫిట్‌గా మారడం అనేది అంత సులువు కాదని, అది సాధ్యపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
బుమ్రా గాయం కోసం న్యూజిలాండ్‌లోని డాక్టర్ రోవాన్ స్కౌటెన్‌తో బీసీసీఐ వైద్య బృందం టచ్‌లో ఉంది. అతడి ఫీడ్‌బ్యాక్ ఆధారంగా బుమ్రా చికిత్స కోసం న్యూజిలాండ్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
అయితే బుమ్రా అందుబాటులో లేకపోతే బ్యాకప్ పేసర్లుగా మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణాను సిద్ధం చేయాలని సెలక్టర్లు చూస్తున్నారు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఇప్పటికే జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌లో హర్షిత్ రాణా ఎంపిక కావడం గమనార్హం. బుమ్రా ఫిట్‌నెస్ సరిగా లేకపోతే ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో హర్షిత్ రాణా ప్రధాన బౌలర్‌గా చోటు దక్కించుకునే అవకాశముంది.