వాషింగ్టన్: ఇన్నాళ్ళు వ్యాపారం వృద్ధి సాధించాలంటే పేపర్లలోనూ టీవీల్లోనూ లేదంటే ఆన్లైన్లో ఇచ్చుకుంటా. కానీ ఇప్పుడు కొత్తగా ఏకంగా అంతరిక్షంలోనే ప్రకటనలు ఇచ్చే అవకాశం వచ్చేస్తోంది. అది కూడా ఎలాన్ మస్క్ ద్వారా ఈ అవకాశం త్వరలో రానుంది.
ఎలన్ మస్క్‌కు చెందిన కంపెనీ అయిన స్పేస్‌ఎక్స్ ఇప్పుడు వ్యాపార ప్రకటనల రంగంలో నవశకానికి బీజం వేయనుంది. ఇప్పుడు ఈ కంపెనీ ద్వారా అంతరిక్షంలో అడ్వర్‌టైజ్ బిల్ బోర్డ్‌లను ఏర్పాటు చేయబోతోంది. స్పేస్‌ఎక్స్ కెనడాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ జియోమెట్రిక్ ఎనర్జీ కార్పోరేషన్ (జీఈసీ) తో కలిసి భాగస్వామ్యంతో క్యూబ్‌శాట్ అనే ఒక కొత్త ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రయోగించే పనిలో ఉంది.
ఈ ఉపగ్రహం ద్వారా ఆయా కంపెనీలు తమ వ్యాపార లోగోల గురించి కానీ లేదంటే అడ్వర్‌టైజ్‌మెంట్‌లను గాని అంతరిక్షంలో వారు ఏర్పాటు చేసే బిల్‌బోర్డ్స్‌పై కన్పించేలా చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. క్యూబ్‌శాట్ శాటిలైట్ ప్రసారం చేసి చూపించే ఆ అడ్వర్‌టైజ్‌మెంట్లను యూట్యూబ్ ద్వారా ప్రత్యక్షప్రసారం కూడా చేయనున్నారు.
ఈ విధంగా ప్రకటనలు ప్రసారం చేయడాణికి క్యూబ్‌సాట్ ఉపగ్రహాణికి సపరేటుగా ఒక సెల్ఫీ స్టిక్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఉపగ్రహాన్ని ఫాల్కన్-9 రాకెటును ఉపయోగించి త్వరలోనే స్పేస్ ఎక్స్ ప్రయోగించబోతున్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో జీఈసీ స్టార్టప్ కంపెనీ సీఈవో శామ్యూల్ రీడ్ మాట్లాడుతూ, ఏదైనా కంపెనీ తమ ప్రకటనలు అంతరిక్షంలో అడ్వర్‌టైజ్ చేసుకోవాలనుకుంటే డాగీకాయిన్ క్రిప్టోకరెన్సీ ఉపయోగించి కూడా ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారు. క్యూబ్‌శాట్ ఉపగ్రహంతో అడ్వర్‌టైజింగ్ రంగంలో పెనుమార్పులు రానున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.