టాలీవుడ్: మొన్ననే ఓటీటీ రంగంలో అడుగుపెట్టిన స్పార్క్ ఓటీటీ రామ్ గోపాల్ వర్ణ రూపొందించిన ‘D కంపెనీ’ సినిమాని విడుదల చేసింది. ఇపుడు ‘క్యాబ్ స్టోరీస్’ అనే సిరీస్ ని కూడా విడుదల చేస్తుంది. ఈ సిరీస్ టీజర్ ని విడుదల చేసింది సినిమా టీం. టీజర్ చూస్తుంటే ఈ సిరీస్ కథ అంత ఒక క్యాబ్ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక రోజంతా క్యాబ్ లో ట్రావెల్ చేసే వ్యక్తుల మధ్య వాళ్ళకే తెలియకుండా వాళ్ళ చుట్టూ జరిగే సంఘటనలు వాళ్ళని ఎలా ప్రభావితం చేశాయి అనే థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో రూపొందినట్టు టీజర్ చూస్తే అర్ధం అవుతుంది.
సునీల్ వాయిస్ ఓవర్ తో ఈ టీజర్ ఆరంభం అవుతుంది. క్యాబ్ లో జరిగే సంఘటనలతో థ్రిల్లింగ్ గా రూపొందించిన ఈ సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సిరీస్ లో గిరి, బిగ్ బాస్ ఫేమ్ దివి, ధనరాజ్, యూట్యూబ్ ఫేమ్ ఆక్టర్స్ శ్రీహాన్, సిరి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్ కృష్ణ ఈ సిరీస్ ని నిర్మించారు. కె.వి.ఎన్ రాజేష్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ని వొల్యూమ్స్ లా గా రూపొందించే ప్లాన్ లో మొదటి వాల్యూం ని ఇపుడు రిలీజ్ చేస్తున్నారు. ఈ సిరీస్ మొదటి వాల్యూం మే 28 నుండి స్పార్క్ ఓటీటీ లో స్ట్రీమ్ అవనుంది.