టాలీవుడ్: కరోనా సమయంలో థియేటర్ల మార్కెట్ సగం వరకి ఓటీటీ కి తరలింది. ఇదివరకు పేరుకే ఉన్న ఓటీటీ లు కూడా కంటెంట్ తో చెలరేగిపోతున్నాయి, వీటితో పాటు కొత్త ఓటీటీ లు కూడా చాలానే ప్రత్యక్షమవుతున్నాయి. అలాంటి కాటగిరీలోకి స్పార్క్ ఓటీటీ వస్తుంది. రామ్ గోపాల్ వర్మ గైడ్లైన్స్ తో ‘సాగర్ మాచనూరు’ అనే బిజినెస్ మాన్ ఈ స్పార్క్ ఓటీటీ ని ప్రారంభించాడు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘D కంపెనీ ‘ సినిమాని కూడా వీళ్ళే నిర్మించారు. మొన్ననే ఈ సినిమాని ఈ ఓటీటీలో విడుదల చేసారు. మంచి పబ్లిసిటీ తో యూసర్ బేస్ బాగానే పెంచుకుంటున్నారు ఈ ఓటీటీ టీం.
యూసర్ బేస్ తో పాటు కంటెంట్ పై కూడా ఫోకస్ చేస్తుంది ఈ ఓటీటీ. క్యాబ్ స్టోరీస్ అనే ఒక వెబ్ సిరీస్ చాలా రోజుల క్రితమే ప్రకటించారు కానీ ఇంతవరకు ఏ ఓటీటీ కూడా ఈ సిరీస్ ని స్ట్రీమ్ చేయలేదు. ప్రస్తుతం స్పార్క్ వాళ్ళు ఈ సిరీస్ ని తమ ఓటీటీ ద్వారా స్ట్రీమ్ చేయనున్నారు. బిగ్ బాస్ ఫేమ్ ‘దివి’, ధన్ రాజ్, గిరి, యూట్యూబ్ సిరీస్ లలో నటించే శ్రీ హాన్, సిరి మరి కొంతమంది ఈ సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ లలో భాగం గా మొదట ‘క్యాబ్ స్టోరీస్ – వాల్యూం 1’ ని మే 28 నుండి స్పార్క్ లో స్ట్రీమ్ చేయనున్నారు.