టాలీవుడ్: రామ్ గోపాల్ వర్మ రూపొందించిన ‘D కంపెనీ’ సినిమాతో ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టిన స్పార్క్ ఓటీటీ, కంటెంట్ ని పెంచుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా వెబ్ సిరీస్ లని విడుదల చేస్తుంది. ముందుగా ‘క్యాబ్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ విడుదల చేస్తుంది. ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా రూపొందిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ఒక కాబ్ లో ప్రయాణించే కొందరు వ్యక్తులు వాళ్ళకి సంబంధం లేకుండానే ఒక ప్రమాదం లో ఇరుక్కుంటారు. వారు ఆ ప్రమాదంలో ఇరుక్కోవడానికి కూడా ఆ కాబ్ లో ప్రయాణించిన వారే కారణం అవుతారు. మరి ఆ ప్రయాణికులు ఆ ప్రమాదం నుండి ఎలా బయటపడతారు, దాన్లో కాబ్ డ్రైవర్ పాత్ర ఏంటి అనేది సిరీస్ విడుదలయ్యాకే తెలుస్తుంది.
వొల్యూమ్స్ లాగ రూపొందిన ఈ వెబ్ సిరీస్ మొదటి వాల్యూం ఈ వారం లో విడుదల అవనుంది. ఈ వెబ్ సిరీస్ లో ప్రవీణ్, దివి, గిరి, ధన్ రాజ్, యూట్యూబ్ ఫేమ్ ఆక్టర్స్ శ్రీహాన్, సిరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. లవ్, డ్రగ్స్ , క్రైం దాదాపు చాలా ఎలెమెంట్స్ ని ట్రైలర్ లో చూపించారు. ఈ సిరీస్ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరియు సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉన్నాయి అని ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్ కృష్ణ ఈ సిరీస్ ని నిర్మించారు.కె.వి.ఎన్ రాజేష్ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. మే 28 నుండి ఈ సిరీస్ స్పార్క్ ఓటీటీ లో అందుబాటులో ఉండనుంది.