న్యూఢిల్లీ: మనకు తెలియని కొత్త నెంబర్ నుంచి కాల్ వస్తే వెంటనే అది ఎవరో ట్రూ కాలర్‌లో సెర్చ్ చేస్తాం. అయితే తాజాగా ట్రూ కాలర్‌లో ఎందుకు ఫోన్ చేస్తున్నారో అన్న కాల్ రీజన్ కూడా కనపడనుందట. వాస్తవానికి ఈ ఫీచర్‌ను 2009 లోనే ప్రవేశపెట్టినప్పటికీ, ఇప్పుడు మరింత అప్‌డేటెడ్ వెర్షన్‌లో ట్రూ కాలర్ రిలీజ్ చేసింది.
వ్యక్తిగతమా, వ్యాపార సంభంధమా లేదా అత్యవసరమా ఇలా, అవతలి వ్యక్తికి ఎందుకు కాల్ చేస్తున్నామన్న రీజన్‌ను టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ ఫీచర్‌తో కాల్ పికప్ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని ట్రూ కాలర్ ఆశిస్తుంది.
ఇంకా ప్రత్యేకించి ఏదైనా కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినప్పుడు యూజర్‌కు మరింత ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ భావిస్తోంది. అయితే గూగుల్ సైతం వెరిఫైడ్ కాల్స్ అనే ఇలాంటి ఫీచర్స్‌ను డీఫాల్ట్‌గా తీసుకురాబోతుంది.
ఈ 2020లో అత్యధికంగా కోరుకున్న ఆప్షన్ ఇదేనని స్వీడన్‌కు చెందిన ప్రధాన కార్యాలయ సంస్థ స్టాక్‌హోమ్ కూడా తెలిపింది. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని ట్రూకాలర్ వెల్లడించింది. ఐఓఎస్‌లో మాత్రం వచ్చే ఏడాది నుంచి ఇది అందుబాటులో ఉండబోతున్నట్లు తెలిపింది.
స్కామ్ ప్రొటెక్షన్ అల్గారిథమ్‌ని ఉపయోగించి కాల్‌ని ప్రైవేట్‌గా ఉంచేలా డిజైన్ చేశారు. దాదాపు 59 భారతీయ భాషల్లో ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. ట్రూ కాలర్ సగటున రోజుకు 9వేల కోట్ల ఫోన్ కాల్స్, మెసేజ్‌లను గుర్తిస్తుండంగా నెలకు 300 కోట్ల ఫోన్‌కాల్స్‌ను బ్లాక్ చేస్తుందని తెలిపారు.