fbpx
Wednesday, September 18, 2024
HomeTelanganaసెప్టెంబర్ 16న స్కూళ్లకు సెలవు రద్దు?

సెప్టెంబర్ 16న స్కూళ్లకు సెలవు రద్దు?

Cancellation -of -school- holiday- on- September 16

తెలంగాణ: సెప్టెంబర్ 16న స్కూళ్లకు సెలవు రద్దు?

తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా భారీగా నష్టం వాటిల్లుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

తెలంగాణలోని ఖమ్మం, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతాలు వరద ముంపుకు గురవగా, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి అధికారులను సహాయక చర్యల్లో మరింత శక్తివంచన లేకుండా ఉంచుతున్నారు.

ఈ క్రమంలో వరద ప్రభావం నేపథ్యంలో పలు ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అయితే, దీని వల్ల విద్యార్థుల సిలబస్‌లో ప్రణాళిక తప్పిపోవడంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో, సెప్టెంబర్ 14న రెండో శనివారం, 15న ఆదివారం, 16న మిలాద్ ఉన్న నబీ పండుగ కోసం సెలవులు ఉన్నాయి. ఈ కారణంగా స్కూళ్లకు నాలుగు రోజుల పాటు సెలవు ఉండనుంది. కానీ, మిలాద్ ఉన్న నబీ పండుగను సెప్టెంబర్ 17న నిర్వహించనున్నట్లు సమాచారం, అదేవిధంగా నిమజ్జనం కూడా ఆ రోజునే ఉంటుంది.

ఈ నేపథ్యంలో, తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో సెప్టెంబర్ 16న ఉన్న సెలవును రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఆ రోజు స్కూళ్లు యథావిధిగా నడుస్తాయని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది.

వరుసగా వచ్చే సెలవులను దృష్టిలో ఉంచుకుని, పలు కుటుంబాలు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకున్నప్పటికీ, ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారికి అనివార్యంగా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది.

ఇదే సమయంలో వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోమారు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular