హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్‌పై ఘోర రోడ్డు ప్రమాదం కాస్తలో తప్పిపోయింది. అతి వేగంగా వస్తున్న ఒక నిసాన్ కారు ఎన్టీఆర్ గార్డెన్ వద్దకు రాగానే అకస్మాత్తుగా పల్టీ కొట్టడంతో శనివారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కారులో ఉన్న వారంత స్వల్ప గాయాలతో భయటపడ్డారు. స్థానికుల సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న సైఫాబాద్ పోలీసలు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి వైద్య సహాయం అందించారు. అనంతరం క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు.
కారు ప్రమాదంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వెంటనే స్పందించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. అతివేగం కారణంగా కారు నడుపుతున్న వ్యక్తి నియంత్రణ కోల్పోడం వల్లే ఈ దుర్గటన జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. వాహనాల నడిపే చోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.