హైదరాబాద్: యూట్యూబర్ హర్షసాయి పై సినిమా హీరోయిన్ ఫిర్యాదు. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేసింది.
ఆ సదరు అమ్మాయి తన న్యాయవాదితో కలిసి నార్సింగి పోలీస్ స్టేషన్లో సదరు యువతి ఫిర్యాదు చేసింది. హర్షసాయితో పాటు అతని తండ్రిపై కూడా ఆ అమ్మాయి ఫిర్యాదు చేసింది.
కాగా, ఆ అమ్మాయి హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని తన ఫిర్యాదులో పేర్కొంది.
తను హర్షసాయికి రూ.2 కోట్లు డబ్బులు కూడా ఇచ్చినట్లు తెలిపింది. అయితే హర్షసాయి సొంతంగా దర్శకత్వం వహించిన ‘మెగా’ అనే సినిమాను నిర్మించి, హీరోయిన్గా కూడా నటించిన మిత్ర పోలీసులకు ఈ రకంగా ఫిర్యాదు చేసింది.